తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం

తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం

ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ టౌన్, అక్షిత న్యూస్:

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలోని రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ. ఆయిల్ పామ్ సాగులో మెళుకువలు,సాగు వలన కలిగే లాభాలు రైతులకు వివరించారు.

భారతదేశంలో వాడుతున్న వంటనూనెలలో ఎక్కువ శాతం పామ్ ఆయిల్ ను వాడటం జరుగుతుంది సంవత్సరానికి డెబ్భై వేలకోట్ల రూపాయల ఆయిల్ ను విదేశాలనుండి దిగుమతి చేసు కుంటున్నాంఅని, ముందు ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణకు నిర్ణయం తీసుకున్నారని, ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు చేయటం జరుగుతుందని తెలిపారు. పామ్ ఆయిల్ తోటలను పెంచడానికి కేవలం రెండు ఎకరాలు వరి పండించే రైతులందరూ 6 ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగు చేయొచ్చు,ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగులో చీడపీడల బెడద,వర్షాలు,కోతలతో,అడవిపందులతో,గాలి వానాలతో పంటకు ఎలాంటి నష్టం ఉండదు.అలాగే ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా వివిధ రకాల పంటలు వేసుకోవచ్చు అని అన్నారు. పామ్ ఆయిల్ పండించే రైతులకు కోసిన గెలలను కొనుగోలు చేయటానికి వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని లేదా ఫ్యాక్టరీ అందుబాటులో ఉంటే పంటను ప్యాక్టరి దగ్గరికు తీసుకు రావడానికి రవాణా ఖర్చులు పూర్తిగా టి.ఎస్ ఆయిల్ ఫెడ్ భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రెడ్డి, హార్టికల్చర్ జిల్లా ఆఫీసర్ శ్రీధర్, ఏ డి ఏ వాసు , సర్పంచులు శెట్టి సురేష్ నాయుడు, పాముల మస్తాన్, లచ్చిరెడ్డి, అలివేలు మంగమ్మ, అమరబోయిన శ్రీనివాస్ యాదవ్, ఏవో రజిని,
అగ్రికల్చర్ అధికారులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking