దాతల సహకారం స్ఫూర్తిదాయకం * 20 ముస్లిం కుటుంబాలకు కూరగాయల పంపిణీ అభినందనీయం * ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్

దాతల సహకారం స్ఫూర్తిదాయకం

* 20 ముస్లిం కుటుంబాలకు కూరగాయల పంపిణీ అభినందనీయం

* ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

పవిత్ర రంజాన్ మాసంలో దాతలు అందించిన సహకారం స్ఫూర్తిదాయకమని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ అభివర్ణించారు. ఈ ఏడాది రంజాన్ మాసంలో మొత్తం 24 మంది దాతల సహకారంతో 1000 ముస్లిం కుటుంబాలకు సాయం అందించేందుకు సహకరించిన దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని విద్యా నగర్ కాలనీలో 20 ముస్లిం కుటుంబాలకు 15 రకాల కూరగాయల జంబో ప్యాక్ పంపిణీ కార్యక్రమాన్ని హమీద్ షేక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రంజాన్ ఉపవాస దీక్షలను ముస్లిం సోదరసోదరీమణులు క్రమశిక్షణతో, భక్తి, శ్రద్దలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

రంజాన్ కిట్లు, కూరగాయల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన బీఆర్ఎస్ చార్మినార్ (జీహెచ్ఎంసీ) మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మంజులా రాణి, సోదరుడు బాబా, డాక్టర్ జీవిత్, సంగారెడ్డికి చెందిన షేక్ ఇస్మాయిల్ కు హమీద్ షేక్ ధన్యవాదములు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో బుధవారం నాటికి 27 కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు. తన యొక్క మిత్ర బృందం, అభిమానులు, శ్రేయోభిలాషులు, అనుచరుల సహకారంతో ఇప్పటి వరకు 1000 మందికి సాయం అందించినట్టు తెలిపారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో1000 కుటుంబాలకు పైగా కిట్లను అందజేస్తున్నట్టు హమీద్ షేక్ పేర్కొన్నారు. ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రఫీ, సాజిద్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking