బిజెపి ని విమర్శించే నైతిక హక్కు ఎంపీ కవితకు లేదు బిజెపి మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్
బిజెపి ని విమర్శించే నైతిక హక్కు ఎంపీ కవితకు లేదు
బిజెపి మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి
చీకటి మహేష్ గౌడ్
మరిపెడ అక్షిత ప్రతినిధి:-
మరిపెడ పట్టణ కేంద్రంలో బిజెపి పట్టణ అధ్యక్షులు భూక్య లింగం నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ మాట్లాడుతూ మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు బిజెపిని విమర్శించే స్థాయి కానీ బిజెపి నాయకులను విమర్శించే నైతిక హక్కు గాని లేదని అన్నారు గతంలో మాలోత్ కవిత ఢిల్లీలో తన పిఏను తన కార్ డ్రైవర్ ని పెట్టుకొని అవినీతికి పాల్పడ్డ సంగతి జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు చూసిన విషయం నిజం కాదా అని అన్నారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషిస్తే తమరు గతంలో మానుకోట పట్టణంలో లిక్కర్ మాఫియాలో ప్రధాన పాత్ర పోషించిన విషయం పత్రికల ద్వారా మీడియా ద్వారా మహబూబాబాద్ ప్రజలకు తెలవదా అన్న విషయాన్ని తమరు గుర్తుంచుకోవాలన్నారు. ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు బిజెపిని, బిజెపి నాయకులను విమర్శించడం విడ్డూరం అన్నారు. మీరు నిన్న నరసింహుల పేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో తమరు మాట్లాడుతూ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది మా నాన్న ఈ మండలాన్ని నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసిండు అని చెప్పారు. మేము అడుగుతున్నాం రెడ్యానాయక్ ఏమి అభివృద్ధి చేశారో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉమ్మడి నరసింహుల పేట మండలంలో గిరిజన విద్యార్థులు సంవత్సరానికి సుమారు 5000 నుండి 6000 మంది విద్యార్థులు ఉన్నత చదువులకు పట్టణాలకు వెళుతుంటే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కానీ ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గాని ఏర్పాటు చేయలేని దద్దమ్మ స్థానిక ఎమ్మెల్యే అన్నారు .ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ తాడ పూర్ణచందర్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షులు బింగి రమేష్ యాదవ్, మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్య కాంతమ్మ, బిజెపి సీనియర్ నాయకులు గంగాధర జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు