బిఆర్ టియు నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు
వేములపల్లి, అక్షిత ప్రతినిధి : వేములపల్లి మండల కేంద్రంలోఎంపీడీఓ కార్యాలయం ఎదుట గత మూడురోజులుగా బిఆర్ టియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరువధిక సమ్మెకు బుధవారం కాంగ్రెస్ పార్టీ మద్దతు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ విఓఎ లకు ఉద్యోగ భద్రత కల్పించి, డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రావు ఎల్లారెడ్డి, రేగట్టి రవీందర్ రెడ్డి , పుట్టల శ్రీనివాస్ ,అమనగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ వలంపట్ల ఝాన్సీప్రవీణ్ , రామచంద్రు ,మాజీ సర్పంచ్ నాగవెల్లి మధు , బుసిరెడ్డి వెంకటరెడ్డి , పల్లా వెంకన్న , పల్లా అశోక్ , సతీష్ , దైద గిరి, మాతంగి చంటి , దేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , చిర్రా క్రాంతి , తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు