ప్రజాస్వామ్య మనుగడకు వెన్నెముక రాజ్యాంగం
* ఐఏఎస్ రిటైర్డ్ చొల్లేటి ప్రభాకర్
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
భారత రాజ్యాంగం దశ,దిశా,నిర్దేశాలు, విధి విధానాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, హక్కుల గురించి తెలియజేసే లిఖిత మైన మహత్తర గ్రంథమే భారత రాజ్యాంగంప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలో, ప్రజలకు , పాలకులు , ఏ విధమైన పరిపాలన చేయాలో తెలియజేసే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల ,సమన్వయం తెలిపేదే భారత రాజ్యాంగంఅని విశ్రాంత ఐఎఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ అన్నారు. బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించినభారత రాజ్యాంగం పట్ల అవగాహన కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను 1947 ఆగస్టు 29న ఎన్నుకోవడం జరిగిందని
స్వతంత్ర భారత దేశానికి వెన్నుముకగా చెప్పుకునే భారత రాజ్యాంగం నిర్మాణానికి 2 సంవత్సరాల,11 నెలల, 18 రోజులు పట్టిందన్నారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా జనాభా ప్రతిపదికనసీట్లుపంచకపోవడం వల్ల కొంతమంది చేతుల్లో ప్రజాస్వామ్యం బందీ అయిపోయిందని విముక్తికి అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. హామీల వర్షం ,ఉచితాలు, ఊహలు ఉయ్యాల ప్రపంచమైనవి ఓట్లను సొమ్ముకు ,లిక్కరకు ,డబ్బుకు ,ప్రలోభాలకు ,అమ్ముకునే ఓటర్లు ఆలోచించాలని ప్రజాస్వామ్యం రాజ్యాంగ పాలన మెజార్టీ ప్రజల పాలన రావాలని అందరూ మార్పు కోరుకోవాలని ప్రజలకు తెలియజేశారు. అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ సేవాసమితిఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ, ప్రజాస్వామ్య ప్రస్థానం పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి చైర్మన్ పాశం నరేందర్ రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ చింతగిరి చైతన్య, వేములపల్లి, ఉట్లపల్లి, పాములపాడు గ్రామ పంచాయతీ సర్పంచులు చిర్ర మల్లయ్య యాదవ్, తక్కలపల్లి శ్రీను,యాతం లక్ష్మీ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగవెళ్లి మధు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి,మహమ్మద్ అరిఫ్ ఏర్పుల వెంకటయ్య, జమీందార్ సామెల్, జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ పుట్టల శ్రీనివాస్, ఎన్ ఎస్ యుఐ రాష్ట్ర నాయకులు బొంగరాల వినోద్, బొంగరాల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.