డిగ్రీ ఫలితాల్లో మాతృశ్రీ విజయ దుందుభి
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :
చౌటుప్పల్ పట్టణ కేంద్రం లోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలలో విజయ దుందుభి మోగించారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలలో మాతృశ్రీ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని బండ శ్వేత 10/10 ఎస్ జి పి ఏ సాధించగా…మరో 20 మంది విద్యార్థులు 9.0 కంటే ఎక్కువ ఎస్ జి పి ఏ లు సాధించి ఉత్తమ ప్రతిభను కనబరిచారు.
ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డా.వి.సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ…విద్యార్థులు ప్రణాళికతో చదువుతూ.. ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి. మహేందర్ రెడ్డి తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.