తుంగతుర్తిలోరాజకీయ హత్యలు పోయి ఆర్థిక హత్యలు వచ్చే …రైస్ మిల్ వ్యాపారిపై అనుమానాలు …నిర్లక్ష్య ధోరణిలో పోలీసులు? …. అదికార పార్టీ నాయకుల పై అనుమానాలు
తుంగతుర్తిలోరాజకీయ హత్యలు పోయి ఆర్థిక హత్యలు వచ్చే
…రైస్ మిల్ వ్యాపారిపై అనుమానాలు
…నిర్లక్ష్య ధోరణిలో పోలీసులు?
…. అదికార పార్టీ నాయకుల పై అనుమానాలు
తుంగతుర్తి అక్షిత:
తుంగతుర్తి పోరాటాల గడ్డ ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన ప్రాంతం తర్వాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మరియు ప్రాంతీయ పార్టీ అయినా టిడిపి వెళ్ళినారు ఈ కాలంలో రాజకీయ హత్యలు రాయలసీమను తలపించే విధంగా ఈ తుంగతుర్తి గడ్డమీద జరిగినాయి కానీ తదానంతరం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి స్థానిక శాసనసభ్యుడు అధికార పార్టీకి చెందినవారు కావడంతో ఇక్కడ రాజకీయ అత్యలు పోయి ఆర్థిక (భూలావాదేవీలు)మొదలయినాయి. కొన్ని విషయాలు బయటకు రాగా మరికొన్ని మరుగున పడిపోయినాయి. అలాంటిదే నేడు జరిగిన హత్య ఒకటి వెలుగులోకి వచ్చింది. వరాల్లోకి వెళితే
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు వెలుగు అంజయ్య తన వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి తిరిగిరాలేదు. పథకం ప్రకారమే ఎవరో చంపి చెట్టుకు ఉరేసుకున్నట్టుగా ఉంది. మృతుడి శవం కుళ్ళిపోయింది. చూడటానికే భయంకరంగా పడి ఉన్నాడు. మృతుడి ఒంటి పై కాళ్ళ మడమలు, గజ్జలు. మెడ పై గొడ్డలితో నరికిన ఆనవాలు కనిపిస్తున్నాయి.
దీనికి ముఖ్య కారణం భూతగాదాలే నని గ్రామ ప్రజలు గుసగుసలాడుతున్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో రైతు వెలుగు అంజయ్య చమట, నెత్తురు ధార పోసి భూమి సంపాదించడమే పాపం అయిందని ఆ భూమిపై కొందరు కన్ను పడి చివరకు దారుణ హత్యకు గురయ్యాడని తన కూతురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మృతుడి కూతురు వెలుగు యాకలక్ష్మి మాట్లాడుతూ
మా నాన్న వెలుగు అంజయ్య ఆయనకు మా పెద్దమ్మ ,మా అమ్మను ఇద్దరూ సొంత అక్క చెల్లెలను పెళ్లి చేసుకున్నాడు. మా పెద్దమ్మ పేరు మీద ఉన్నటువంటి పన్నెండు ఎకరాల ఆస్తిని మా నాన్నకు, నాకు తెలియకుండా మా పెద్దమ్మను నమ్మించి పిట్టల అంజయ్య పట్టా చేసుకున్నాడు. ఆ విషయం తెలిసిన తర్వాత మా నాన్న, నేను కోర్ట్ లో కేసు వేయడం జరిగింది. ఇప్పుడు అది పెండింగ్ లో ఉంది. తీర్పు వచ్చేంతవరకు ఇరువర్గాలు ఆ ప్రాపర్టీని ఏమి చేయడానికి వీలు లేదని కోర్టు చెప్పింది. కానీ మా పెద్దమ్మ మరియు పిట్టల అంజయ్య వెళ్లి ఇమ్మడి సోమ నరసయ్యకు అమ్మి 40 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకోవడం జరిగింది. కానీ అది రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఎన్నో మార్లు మా నాన్నని, మా ఫ్యామిలీ మెంబర్స్ ని బెదిరించారు. వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి పిట్టల అంజయ్య అనే వ్యక్తి చంపుతా నంటూ బెదిరించారాని మా నాన్న నాతో చెప్తూ ఉండేవాడు. పెద్ద తలకాయలు ఇందులో ఉన్నాయని వాపోయారు. ఈ వివాదంలో ఇన్వాల్వ్మెంట్ అయి ఒక్కొక్కరు ఒక షేర్ ప్రకారం ప్రాపర్టీని పంచుకోవచ్చని మా నాన్నని చంపారని తెలిపారు.
ఇమ్మడి సోమ నరసయ్య, కొల్లూరి లింగమల్లు, పొదిల సుధాకర్, జంగిడి జగన్నాథం, జంగిడి సురేష్ ల పై తక్షణమే వారిపై చర్యలు తీసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని అనుమానం ఉన్న వ్యక్తులపై పిటిషన్ రాసి ఇవ్వడం జరిగిందని తెలిపారు.