తప్పనిసరిగా ధాన్యాన్ని
దిగుమతి చేసుకోవాలి
*మిల్లర్లును ఆదేశించిన అదనపు కలెక్టర్ బాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : ఐకెపి పిఎసిఎస్ ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని, దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు గురి చేస్తే మిల్లులను సీజ్ చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు హెచ్చరించారు బుధవారం వేములపల్లి మండలంలోని శెట్టి పాలెం లో కామదేను కనకమహాలక్ష్మి రైస్ మిల్లులను, ఐకెపి కేంద్రాన్ని డీఎస్ఓ వెంకటేశ్వర్లతో కలిసి తనిఖీ చేశారు. మిల్లుల వద్ద ఆగి ఉన్న లారీలను పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు రైస్ మిల్లు వద్ద మిల్లర్లతో సమావేశం జరిపి ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు ధాన్యాన్ని పంపిస్తున్నామని మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నారు. దిగుమతి చేసుకోవడంలో అలసత్యo వహించిన ఇబ్బందులు గురిచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని రైతులు తీసుకురావాలని సూచించారు. ధాన్యం 17% లోపు తేమ శాతం ఉండేవిధంగా చూసుకోవాలన్నారు ధాన్యంలో తేమ,పొట్టు, రాళ్లు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన దాన్ని మాత్రమే మిల్లర్లు తీసుకుంటారని వాటిని మిల్లింగ్ చేయడం వల్ల తిరిగి పేదలకు పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు రైతులు ధాన్యం నాణ్యత విషయంలో నిబంధనలను పాటించాలని సూచించారు ధాన్యం అమ్మిన వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ కార్యదర్శి బి.వెంకటరమణ చౌదరి, సివిల్ సప్లై డిటి రామకృష్ణారెడ్డి, ఆర్ ఐ సురేందర్ సింగ్ పాల్గొన్నారు