ఉపాధి పనులు  ముమ్మరంగా చేపట్టాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి 

ఉపాధి పనులు 

ముమ్మరంగా చేపట్టాలి

కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పనులు ముమ్మరంగా చేపట్టాలని,పనుల ప్రగతి ని మెరుగు పరచాలని   జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు.

బుధవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తో కలిసి ఎం.పి.డి. ఓ లు, ఎం.పి.ఓ లు, ఏ.పి.ఓలతో సమావేశం నిర్వహించి మండలాలలో  ఉపాధి హామీ లేబర్ మొబిలైజేషన్,కంపోస్ట్ తయారీ,వైకుంఠ ధామం ల  నిర్మాణ పనులు, తెలంగాణా క్రీడా ప్రగతి ప్రాంగణం లు,పల్లె ప్రకృతి వనం లు,బృహత్ పల్లె ప్రకృతి వనం లు ఏర్పాటు,నర్సరీ లు తదితర అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా కూలీలకు పనులు కల్పించి పనులు విస్తృత స్థాయి లో ఉదృతం చేయాలని అన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు సంబంధించిన సమగ్ర వివరాల జాబితా ప్రతి గ్రామపంచాయతీలలో సిద్ధంగా ఉంచాలని ఆయన తెలిపారు. అదేవిధంగా గతంలో ఉపాధి పనులలో పాల్గొని ప్రస్తుతం పని మానేసిన వారి జాబితా రూపొందించి వారు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాక నూతనంగా పనులు కల్పించాలని కోరిన వారి జాబితా తయారు చేసి వారిని పనికి హాజరయ్యేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ పథకంలో లేబర్ మొబిలైజేషన్, పనుల గుర్తింపు, షెల్ఫ్ ఆఫ్ వర్క్స్, మస్టర్ మానిటరింగ్, పేమెంట్స్ వంటివి అధికారులు టార్గెట్ పెట్టుకొని పని చేయాలని ఆయన తెలిపారు. అంతేగాని వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు మీరు పంపే నివేదికలకు పొంతనలేదని ఆయన అన్నారు. పది మందిని యూనిట్ గా తీసుకొని వారికి గుర్తించిన పనికి సంబంధించిన మార్కింగ్ చేసి గిట్టుబాటు కూలి అధికంగా కల్పించేలా పనులు జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాబోయే వారం రోజులలో ఉపాధి హామీ పనుల ప్రగతిని ఇంకా మెరుగుపరచాలని అధికారులను కోరారు.

సోషల్ ఆడిటింగ్ కు డి.అర్.డి. ఓ మాత్రమే వెళ్లాలని ఆయన సూచించారు. నేరేడుగొమ్ము, త్రిపురారం మండలాలలో స్వయంగా పర్యటించి పనులను పర్యవెక్షిస్తానని ఆయన అధికారులకు తెలిపారు. సెగ్రీ గేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాల పనులు పూర్తి కావాలని ఆయన అధికారులను కోరారు. ఎక్కడైనా భూ సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తేవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

మండల స్థాయిలో ఎం.పి.డి.ఓ లు తహాశిల్డార్ లతో సమన్వయం చేసుకొని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఇప్పటివరకు నూటికి నూరు శాతం పూర్తి అయిన సెగ్రి గేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాల వివరాలు ఫోటోలతో సహా నివేదికలను సంబంధిత అధికారులు వెంటనే సమర్పించాలని ఆయన ఆదేశించారు. సెగ్రి గేషన్ షెడ్ లలో కంపోస్ట్ తయారీ చేయాలని,పూర్తి స్థాయి లో వినియోగం లోకి తీసుకు రావాలని,వైకుంఠ ధామం లను కూడా వినియోగం లోకి తీసుకు రావాలని అన్నారు.

నర్సరీలలో జూన్ వరకు మొక్కలు ఎపుగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. రాబోయే సీజన్ వరకు మొక్కలను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలను అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించాలని ఆయన కోరారు. గ్రామాలలో దీర్ఘకాలికంగా పెండింగ్ పనులు ఉన్నందున అధికారులను మందలించారు. ఇక నుంచి ఏ పనులు పెండింగ్లో ఉండరాదని అందుకోసం అధికారుల బృందం తనతో పాటు నియోజకవర్గాల చొప్పున తనిఖీ చేస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగా స్వయంగా నేను నకీరేకల్ నియోజకవర్గం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నాగార్జునసాగర్, జిల్లా పరిషత్ సీఈవో మునుగోడు, డిఆర్డిఓ నల్లగొండ, డిపిఓ మిర్యాలగూడ, ఏ.పి.డి దేవరకొండ నియోజకవర్గాలలో పర్యటించి అన్ని అభివృద్ధి పనులను తనిఖీ చేస్తారని ఆయన తెలిపారు.

సమావేశానికి హాజరైన ఎంపీడీవో లను మండలాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పలు ప్రశ్నలు సంధించి పలు విషయాలను, పనుల ప్రగతిని వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, డి.అర్.డి. ఓ కాళిందిని, జిల్లా పరిషత్ సి. ఈ. ఓ  ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking