గుడిసె వాసుల సమస్యలు కోకొల్లలు ఉద్యమాల పేరిట గుడిసె కేంద్రాలు నాయకుల పేరిట ఒకటికి మించి ఆక్రమణలు ఈ విషయమై తీవ్రంగా స్పందించిన పోలీస్ కమిషనర్
గుడిసె వాసుల సమస్యలు కోకొల్లలు ఉద్యమాల పేరిట గుడిసె కేంద్రాలు నాయకుల పేరిట ఒకటికి మించి ఆక్రమణలు ఈ విషయమై తీవ్రంగా స్పందించిన పోలీస్ కమిషనర్ ఏవి,రంగనాథ్ వరంగల్,అక్షిత బ్యూరో : గుడిసె వాసుల్లో పెరుగుతున్న భయాందోళనలు నాయకుల పేరిట అభివృద్ధి కమిటీల పేరిట పేదలు వేసుకున్న గుడిసెల్లో పేదలుగా వచ్చి పెత్తనం చెలాయిస్తున్న నాయకులు వరంగల్ నగరంలో గతంలో 60 70 స్లం ఏరియాలు ఉండగా ప్రస్తుతం ఒక పది చోట్ల కొత్తగా గుడిసె ప్రాంతాలు వెలిశాయి గత 15 సంవత్సరాలుగా వేసినటువంటి గుడిసెల్లో నివాసం ఉంటున్న పేద ప్రజల్లో నుంచి పార్టీలు మారి వివిధ పార్టీల్లో సభ్యులుగా ఉన్నటువంటి వారు నాయకులుగా చలామణి అవుతూ పేద ప్రజలు రాజకీయం తెలియనటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారిని టార్గెట్గా చేసుకొని నాయకులుగా చలామణి అవుతున్న వారు వారికి ఇచ్చినటువంటి ఖాళీ స్థలం లో నివాసం ఉంటూ ఇతర ఖాళీ స్థలాలపై కన్నేసి నాయకులుగా వాటిని పంచుకుంటున్నారు ఒక్కో కాలి స్థలానికి ఐదు నుంచి ఆరు లక్షల వరకు డిమాండ్ చేస్తూ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్లే అమ్ముకుంటున్నారని బదనాం చేసేందుకు ఈ గుడిసె నాయకులు పేదవారికి స్థానం లేకుండా ఖాళీ స్థలాలను వారే కబ్జా చేస్తున్నారు.

ఈ విషయమై ఇటీవల ఒక బాధితురాలు స్థానిక ఇంతేజారుగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సమస్యను కమిషనర్ దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు ఈ గుడిసెల అమ్ముకునే విషయమై పోలీస్ కమిషనర్ సీరియస్గా స్పందించారు గుడిసె ప్రాంతాల్లో ఎవరైనా గుడిసెలు అమ్మిన కొన్న చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఎవరైనా దీర్ఘకాలంగా రాకపోతే ఆ స్థలాన్ని మరో పేదవారికి ఇచ్చేందుకు సహకరించాలని అంతేతప్ప గుడిసెలు అమ్ముకోవడం నాయకుల పేరిట ఒకటికంటే ఎక్కువ తీసుకొని వాటిని అమ్ముకోవడం లాంటి జీవితం నేరమని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సీరియస్గా తెలియజేసినారు. ఇటువంటి సమస్యలు తలెత్తితే ఎవరైనా డబ్బులు అడిగినా డబ్బులు తీసుకున్న తమ దృష్టికి తీసుకు వస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బాధితులకు భరోసా ఇచ్చారు ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీలకు చెందిన గుడిసె సంఘాల నాయకులు ఎవరు నిజమైన బాధితులో విచారించి వారికి గుడిసెలు ఇస్తే ఈ రకమైన సమస్యలు తలెత్తవని ఉద్యమాల కోసము వారి పార్టీ మనుగడ కోసము ఇష్టం వచ్చిన రీతిగా గుడిసెలు ఇవ్వడం వల్ల నిజమైన పేదలకు అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.