అంబెడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే నరేందర్

అంబెడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే నరేందర్
వరంగల్ ,అక్షిత బ్యూరో : కాశిబుగ్గ అంబెడ్కర్ కాలనిలో అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబెడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిదిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎంపీ పసునూరి దయాకర్,కార్పొరేటర్ గుండేటి నరేందర్,మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి భాగ్యలక్ష్మి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబెడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్(3)ద్వారా కేసీఆర్ నాయకత్వనా తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్నామని దేశంలోనే అతి పెద్ద 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టి ఆ మహానియుణ్ణి గౌరవించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు

నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ ను అభివృద్ధి దిశగా తీసుకొని పోతున్నామని గుడిసేవాసులకు,దళిత కాలనిలలో వాడవడన అద్భుతమైన రోడ్లు వేశామని.
కేసీఆర్ నాయకత్వనా అన్నీ రంగాల్లో దూసుకొనిపోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
3800కొట్లతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నంబర్ గా నిలుపుతున్నామన్నారు
జిల్లా కేంద్రంలో పాటు పాలనసముదాయైన కలెక్టరేట్ తూర్పు నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని ఆ కలెక్టరేట్ ను సైతం నిరుపేదల మధ్య ఏర్పాటు చేస్తున్నామన్నారు 75 కోట్లతో బస్ స్టేషన్,మోడ్రన్ కూరగాయల మార్కెట్,పండ్ల మార్కెట్,మాంసహరనికి ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామనన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్,కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్,డివిజన్ అధ్యక్షులు ఎం.డి ఇగ్బాల్,సింగారపు చిరంజీవి, అంబెడ్కర్ యువజన సంఘం నాయకులు,డివిజన్ ముఖ్య నాయకులు,దళిత నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking