వివోఏ ల సమస్యలు వెంటనే పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.

వివోఏ ల సమస్యలు వెంటనే పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.

చిట్యాల,అక్షిత ప్రతినిధి: వివోఏ ల సమస్యలు పరిష్కరించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్,అవిశెట్టి శంకరయ్య లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల మండల కేంద్రం లో గత నాలుగు రోజులుగా ఐకేపి, వివోఏ లు చేస్తున్న సమ్మె కు గురువారం నాడు వారు మద్ధతు తెలిపి మాట్లాడారు. గత ఇరవై ఐదు ఏళ్ళుగా వారితో పాలక పార్టీ లు నెలకు 3900/- రూపాయలు ఇచ్చి వెట్టిచాకిరీ చేయించుకోవడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. అర్హులైన వారికి సిసిలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం పరిష్కరించాలని,లేనియెడల భవిష్యత్తు లో వారు చేసే ఆందోళన, పోరాటాలకు సిపిఎం రాజకీయాలకు అతీతంగా పోరాడవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు ఎదుల్ల లక్ష్మి,గుడిసె సువర్ణ, నాయకులు పాకాల సత్యనారాయణ, వనజ కుమారి, గుడిసె పద్మ, దేశపాక సత్తమ్మ, వడ్డెగాని విజయ, కళమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking