అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి.
పినపాక అక్షిత ప్రతినిధి:
సిపిఐ( ఎంఎల్ )ప్రజాపందా తెలంగాణ రాష్ట్ర కమిటీ, ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా గురువారం ఆసరా పెన్షన్లు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులన్నీ ఉచితంగా సరఫరా చేయాలని, వంటగ్యాస్, నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుండాల తాహసిల్దార్ కు మెమోరండం సమర్పించనైనది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్) ప్రజాపందా గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, పార్టీ జిల్లా నాయకులు ఈ సం శంకర్, పి. వై. ఎల్. గుండాల మండల కార్యదర్శి పూనెం మంగయ్య లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అర్హులైన వారందరికీ పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత ప్రజల్ని మోసగిస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు కూడా అందించడం లేదని నిత్యవసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించాల్సింది పోయి అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్న పట్టించుకోవడంలేదని, అందువల్ల పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కడుపునిండా అన్నం తినలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోవు కాలంలో ఆహార కొరత పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు న్యూట్రిషన్ ప్రాబ్లం తో అనేక రోగాల పాలై జీవితాలను కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని లేకపోతే ప్రజాపందా ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) ప్రజాపందా నాయకులు తెల్లం రాజు, బొర్రా వెంకన్న ,కోడూరి జగన్, కొమరం సమ్మయ్య, కుంజ నరేష్, కుంజరమేష్, గట్టి సురేష్, కొమరం శ్రీను ,గట్టి రమేష్, మోకాళ్ళ పాపయ్య, కల్తీ సుదర్శన్, ఈసం ప్రభాకర్, సంతు, పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.