గుడిసేవాసుల కోసం ఉచిత దరఖాస్తు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

గుడిసేవాసుల కోసం ఉచిత దరఖాస్తు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్,అక్షిత బ్యూరో : 36వ డివిజన్ జ్యోతిబసు నగర్ లో గుడిసేవాసులకు పట్టాలందించడమే ద్యేయంగా జీవో 58,59 అమలుకై ఉచిత మీసేవ దరఖాస్తు కేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,డిప్యూటి మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.అర్హులైన నిరుపేద గుడిసేవాసులకు పట్టాలను అందించడమే ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అహర్నిశలు శ్రమిస్తున్నామని గుడిసేవాసులందరు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తుకు అయ్యే ఖర్చును తానే వ్యక్తిగతంగా బరిస్తున్నానని సంబంధిత పత్రాలతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తో పాటు డివిజన్ అధ్యక్షులు వెలుపుకొండ యాకయ్య,బిఆర్ఎస్ నాయకులు మర్రి శ్రీనివాస్,గడల రమేష్,శ్యామ్,నరేష్,ఐలయ్య,రమ,శ్రీను,మోహన్,లావణ్య,జ్యోతి, గుల్బా,మధు,గణేష్, అబ్బు,అనిల్ తదితరులు హాజరయ్యారు

Leave A Reply

Your email address will not be published.

Breaking