మండల వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు

మండల వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు

చేర్యాల,ఏప్రిల్ 22 అక్షిత ప్రతినిధి: ముస్లింల పవిత్రమైన రంజాన్ వేడుకల సందర్భంగా చేర్యాల పట్టణ కేంద్రంతో పాటు నాగపురి,చుంచనకోట,కడవెరుగు, కాశ గుడిసెలు తదితర గ్రామాలలో శనివారం ముస్లిం సోదరులు నూతన వస్త్రాలను ధరించి,మజీద్ లలో ఘనంగా ప్రార్థనలు నిర్వహించినారు.అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లిం సోదరులు మరియు హిందువులు కలిసి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ రంజాన్ వేడుకల్లో ఆయా గ్రామాల ముస్లిం మత గురువులు,మజీద్ కమిటీ సభ్యులు,ముస్లిం కుల పెద్దలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking