రెండు రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ ◆ సిద్ధిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభిం చిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.

రెండు రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ
◆ సిద్ధిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభిం చిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.

సిద్ధిపేట అక్షిత ప్రతినిధి :

ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనమని, నూకలు బుక్కమని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవహేళన చేసి కారెడ్డ మాడిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.రైతు శ్రేయస్సు ప్రధాన ధ్యేయమని ముఖ్యమని సీఎం కేసీఆర్ ముందుకొచ్చి రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.సిద్ధిపేట అర్బన్ మండలంలోని వెల్క టూరు గ్రామంలో శనివారం సాయంత్రం జిల్లాలోనే మొదటి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ రోజు ధాన్యం ఆ రోజు కొనుగోళ్లు చేయాలని, లారీల ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పౌర సరఫరా, తహశీల్దారును ఆదే శించారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన రెండు రోజులలో రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బు లు జమ చేస్తామని హామీని చ్చారు. గ్రామంలో ఇది వరకే చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు. అసంపూర్తిగా నిలిచిన గ్రామాభివృద్ధి పనులు వారంలో ప్రారంభోత్సవాలు చేసుకుందామని మంత్రి తెలిపారు.ఈ మేరకు ఆత్మహ త్య చేసుకున్న రైతు కుటుంబా నికి చెందిన పెంబర్తి మాధవికి రూ.5 లక్షల రూపాయల రైతుభీమా చెక్కు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking