ధరిత్రి దినోత్సవం పేరిట పర్యావరణ పరిరక్షణ ఉద్యమం చేద్దాం. ధరిత్రి బాగుంటేనే భవిష్యత్తు ధరిత్రిని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేసిన ఆర్ టీ హెచ్ ఎఫ్ సభ్యులు

ధరిత్రి దినోత్సవం పేరిట పర్యావరణ పరిరక్షణ ఉద్యమం చేద్దాం.

ధరిత్రి బాగుంటేనే భవిష్యత్తు
ధరిత్రిని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేసిన ఆర్ టీ హెచ్ ఎఫ్ సభ్యులు

మంచిర్యాల, అక్షిత బ్యూరో:-

ధరిత్రి బాగుంటేనే భవిష్యత్తు అని రైట్ టు హెల్త్ ఫోరం, ఆర్ టి హెచ్ ఎఫ్ అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు. శనివారం ప్రపంచ ధరిత్రి దినోత్సవ సందర్భంగా రామకృష్ణాపూర్ రామాలయం సెంటర్ లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. ప్రతి ఇంట్లో మొక్కలు నాటుదాం. మన ధరిత్రీని కాపాడుదాం.. అని ఫోరమ్ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రాజలింగు మాట్లాడుతూ, ళఎంత ముందుకు వెళ్తున్న, పీల్చాల్సింది ఆక్సిజన్ నే అని, జీవించాల్సింది భూమ్మీదనేనని అందుకే భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ధరిత్రి దినోత్సవం పేరిట పర్యావరణ పరిరక్షణ ఉద్యమం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిహెచ్ఎఫ్ సభ్యులు వేల్పుల వెంకటస్వామి, చంద్రగిరి కుమారస్వామి, సురేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking