ఘనంగా రంజాన్ వేడుకలు
తుంగతుర్తి, అక్షిత :
రంజాన్ పండగను ముస్లింలు మండల వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేసిన ముస్లింలు పవిత్ర రంజాన్ సందర్భంగా
నూతన దుస్తులు ధరించి చిన్నా పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ మేరకు పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గతించిన తమ కుటుంబస భ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈద్గా వద్ద మౌలానా అబుల్ అహ్మద్ ప్రార్థనలు చేయించి రంజాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. రంజాన్‌పండుగ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఆకారపు సైదులు, జర్నలిస్టులు పోలెపాక రామచంద్రు ఓరుగంటి శ్రీనివాస్, సుభాష్, కొండగడుపుల ఎల్లయ్య శుభాకాంక్షలు తెలిపారు.