అస్వస్థతకు గురైన కార్మికుడిని పరామర్శించిన వైఎస్సార్ టిపి నేతలు

అస్వస్థతకు గురైన కార్మికుడిని పరామర్శించిన వైఎస్సార్ టిపి నేతలు

మంచిర్యాల, అక్షిత బ్యూరో:-

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా లోని కాసీపేట గనిలో సూపర్వైజర్ రాత్రి బదిలీ కార్మికుడిచే నిరంతరాయంగా నిబంధనలకు విరుద్ధంగా మొదటి బదలీలో సుమారు 10గంటల వరకు పనిచేయడం తోపాటు అస్వస్థతకు గురైన కార్మికుడిని రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ టిపి చెన్నూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ దుర్గం నాగేష్ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభుదేవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్ధీన్ లు మాట్లాడుతూ, కార్మికులపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గద్దె సాయి కిషోర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఓరం కవి రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking