నక్కర్త మేడిపల్లిలో చలివేంద్రం ప్రారంభం

నక్కర్త మేడిపల్లిలో చలివేంద్రం ప్రారంభం

రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి:- వేసవితాపాన్ని దృష్టిలో పెట్టుకొని మండల పరిధిలోని నక్కర్త మేడిపల్లి గ్రామంలో బండ లింగం డైమండ్ వాటర్ సర్వీస్ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంను శనివారం మాజీ ఎంపీటీసీ ముంత జంగయ్య, కోన్ రెడ్డి అచ్చి రెడ్డి ప్రారంభించారు. ఎండవేడిమిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరుని అందించాలనే ఉద్దేశంతో చలివేంద్రంను ఏర్పాటు చేసినందుకు బండ లింగంను అభినందించారు. నీటిని వృధా చేయకుండా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కందికొండ సుధాకర్, వంగూరి శ్రీశైలం, శివ మోడీ, శ్రీకాంత్, సందీప్, బాష, మహేష్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking