రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ మునగాల మండలం లో వచ్చిన పత్రిక ప్రకటనకు ఖండిస్తున్న జిల్లా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు ఎస్పి వెంకటప్పయ్య.
రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ మునగాల మండలం లో వచ్చిన పత్రిక ప్రకటనకు ఖండిస్తున్న జిల్లా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు ఎస్పి వెంకటప్పయ్య.
కోదాడ అక్షిత ప్రతినిధి:
ఈరోజు పత్రికలలో, సోషల్ మీడియాలలో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంఘము నుండి మూకుమ్మడిగా 40 మంది రాజీనామా చేసినారు అనే విషయం అవాస్తవం, అబద్ధం. అని జిల్లా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు ఎస్.పి వెంకటప్పయ్య అన్నారుఇటీవల కాలంలో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మునగాల మండలంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు ఈ కమిటీలో తమ వ్యక్తులకు పదవి దక్కని కొందరు కుట్రపన్ని మోసపూరితంగా పదవులే ఆకాంక్షగా కమిటీకి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అని సంఘమునకు చెడ్డ పేరు తెస్తూ సంఘ నియమ నిబంధనలు ఉల్లంగిస్తూ ప్రవర్తిస్తున్నారు అని వారన్నారు సంఘ వ్యతిరేక విషయాలలో పాల్గొంటున్నారు అని పలుమార్లు జిల్లా కమిటీ హెచ్చరించినప్పటికీ మీ మీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా వేరే సంఘమునకు పోయినారు. అప్పటికే వీరిని రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంఘము నుండి సస్పెండ్ చేయటము జరిగినది. కానీ 40 మంది ఆర్.ఎం.పి & పి.ఎం.పి సభ్యులు ముకుమ్మడి గా రాజీనామా చేసినారు అనే విషయం అబద్దం. ఈ విషయం ను జిల్లా స్థాయిలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పొనుగోటి భుజంగరావు జిల్లా అధ్యక్షులు,
గుణగంటి వెంకన్న గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,ఎస్పీ వెంకటప్పయ్య జిల్లా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు, దొంతగాని రవి బాబు జిల్లా నాయకులు,ఎరుకల శ్రీశైలం గౌడ్ మునగాల మండల అధ్యక్షులు, శ్రీ దాచేపల్లి మురళీకృష్ణ మండల ప్రధానకార్యదర్శిచిరందాసు ఉపేంద్ర చారి,పురుషోత్తం బాబు, అనిల్, ఖాదర్ మరియు మండల కమిటీ సభ్యులు అందరూ ఈ విషయమును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.