తండ్రులు జాగ్రత్త!!!

తండ్రులు జాగ్రత్త ! ! !

బాలుడికి వాహనం ఇచ్చిన తండ్రికి జైలు వరంగల్, 

అక్షిత బ్యూరో :

మైనారిటీ తీరని కుమారుడికి బైక్ ఇచ్చిన తండ్రికి రెండో తరగతి న్యాయమూర్తి వీరస్వామి మంగళవారం 2రోజుల జైలుశిక్ష విధించారు. ఈ నెల 8న హన్మకొండలోని తెలంగాణ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ చిన్నగుడూరుకు చెందిన 14 ఏళ్ల బాలుడు ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. బాలుడికి వాహనం ఇచ్చిన కారణంగా తండ్రి సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు ఇక పై పెద్దోళ్ళు తస్మాత్ జాగ్రత్త చిన్నోల్లకు బండ్లు ఇస్తే పెద్దోళ్ళు జైళ్లకు.

Leave A Reply

Your email address will not be published.

Breaking