ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం :: వరంగల్( తూర్పు)అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం :: వరంగల్( తూర్పు)అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా
సెక్టోరల్ అధికారుల తో ఎన్నికల ప్రక్రియ పై సమావేశం
వరంగల్,అక్షిత బ్యూరో :
ఎన్నికల నిర్వహణ లో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని వరంగల్( తూర్పు)అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు.
బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హల్ లో వరంగల్( తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గ పరిధి కి సంబంధించి సెక్టోరల్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదని, ఒక సెక్టోరల్ అధికారి పరిధిలో 9 పోలింగ్ కేంద్రాలు ఉండే అవకాశం ఉందని, పోలింగ్ కేంద్రాలలో వసతులు, పి.డబ్ల్యు.డి. ఓటర్లకు ర్యాంపుల ఏర్పాటు, నీటి వసతి, ఫర్నిచర్, విద్యుత్, ఫ్యాన్లు, పోలింగ్ కేంద్రంలో ఏవైనా మరమ్మత్తులు ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేసి అన్ని వసతులను పరిశీలించి సంబంధిత ఫార్మాట్లో వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలు జరిగే వారం ముందు నుండి సెక్టోరల్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ సిబ్బందిని తీసుకువెళ్లి తిరిగి తీసుకురావడం, ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం, పోలింగ్ కేంద్రాలలో నెలకొన్న సమస్యలపై ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం, రిజర్వు
ఈ వి ఎం అందుబాటులో ఉంచుకోవడం, ఎన్నికల రోజున కేటాయించిన రూట్ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తహసిల్దార్లు, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి పోలింగ్ కేంద్రంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ఈ సమావేశం లో ఏ.సి.పి.బోనాల కిషన్,తహశీల్దార్ లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు,సి.ఐ.లు వెంకటేశ్వర్లు,శ్రీనివాస్,సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.