ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధితో పాటు విద్య, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామంలోని వివిధ వర్గాల ప్రతినిధులు, మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking