జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్ ఐ గోపాతి సతీష్

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట మండలం కేంద్రంలో ఎస్సై కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్నపేట ఎస్సై గోపాతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పోలీస్‌ సిబ్బందికి విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నోటుబుక్స్‌ పంపిణీ చేశారు.విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎస్ ఐ గోపాతి సతీష్ సూచించారు.కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking