స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
బోగారం గ్రామంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశభక్తి స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బోగారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడటం వల్లే మనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. యువత విద్యలో రాణించి సమాజానికి, దేశానికి సేవ చేయాలని సూచించారు. అనంతరం బోగారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్మించిన స్టేజీని ప్రారంభించారు. దాతలు కూనూరు మాధవి–కూనూరు సాయికుమార్ గౌడ్ దంపతులు విద్యార్థుల సౌకర్యార్థం స్టేజీని నిర్మించి పాఠశాలకు అందించారు. విద్యార్థుల అవసరాల కోసం సేవాభావంతో స్టేజీ నిర్మించి అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్ యాదవ్, మేడి అంజనేయులు, నేరటి మానస సురేష్ యాదవ్, కడారి పావని పాపయ్య, వనం అండాలు, యాదగిరి, కనుక మల్లేష్, గోగు సురేష్ యాదవ్, సంఘ బంధం అధ్యక్షురాలు పబ్బు జ్యోతి, గ్రామపంచాయతీ కార్యదర్శి సుధా, పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీలత, రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, మాజీ సర్పంచ్ జిల్లా మార్కండేయ, మాజీ ఎంపీటీసీ మేడి రామలింగం, వీవోఏ భోగ సంద్య, అంగన్వాడీ టీచర్ బత్తుల వసంత తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రామ పెద్దలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పండుగను ఘనంగా నిర్వహించారు.