సూర్య ప్రభంజనం ఎడిటర్ శ్రీనివాస్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
సూర్య ప్రభంజనం దినపత్రిక ఎడిటర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజలకు–ప్రభుత్వానికి వారధిగా నిలవడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని పలువురు పేర్కొన్నారు. శ్రీనివాస్ మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవిస్తూ జర్నలిజం రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికం దినపత్రిక ఎడిటర్ Dr. కొండ మల్లేశం గౌడ్, ప్రజాజ్యోతి రిపోర్టర్ లవణ ఉపేందర్, తెలంగాణ కేసరి రిపోర్టర్ జినుకల శ్రీనివాస్, తొలి అక్షరం రిపోర్టర్ నోముల శంకర్, నవభారత రిపోర్టర్ నాగటి యాదయ్య, తొలివెలుగు రిపోర్టర్ కర్నే వినయ్ పాత్రికేయులు మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు..