ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విద్యార్థులకు క్రీడా పోటీలు.. విజేతలకు బహుమతులు

చిట్యాల అక్షిత ప్రతినిధి 

మండలంలోని ఊరుమడ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బీసీ బాలుర హాస్టల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు సహకారంతో నిర్వహించిన ఈ పోటీల్లో హాస్టల్, పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.అనంతరం ఊరుమడ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో విజేతలకు జ్ఞాపికలు, మెడల్స్, బహుమతులు, ప్రోత్సాహకాలను పల్లపు బుద్ధుడు అందజేశారు. ముఖ్యఅతిథిగా గ్రామపంచాయతీ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం పాల్గొన్నారు.ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఏకాగ్రత పెంపొందుతుందని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగడం క్రీడాస్ఫూర్తిలో భాగమని పేర్కొన్నారు. టీమ్‌ వర్క్, ఐకమత్యం, క్రమశిక్షణ వంటి విలువలను క్రీడలు విద్యార్థుల్లో పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థిని అభినందించి, భవిష్యత్తులో తమ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించిన పల్లపు బుద్ధుడిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూపని వెంకన్న, హాస్టల్ వార్డెన్ ప్రసాద్ శాలువాతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఊరుమడ్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లు, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్ గౌడ్, వార్డు సభ్యులు జనపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీనివాస్, ఎలిమినేటి హరిప్రసాద్‌రెడ్డి, మందుగుల పార్వతమ్మ, మర్రి పూలమ్మ, పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రముఖులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking