పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయొద్దు, మా బ్రతుకులతో ఆడుకోవద్దు
సాంకేతిక విద్యా మండలి నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి ధర్నా చేసిన వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు
వరంగల్ పాలిటెక్నిక్ నుండి ములుగు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా లో పాల్గొన్న విద్యార్థులు
తక్షణమే పాలిటెక్నిక్ విద్యను (శక్తి) లో విలీనం చేయడం మానుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరిక
వరంగల్, అక్షిత బ్యూరో:
తెలంగాణ సర్కార్ సాంకేతిక విద్యను ఒకే గూడు కిందకి తీసుకొచ్చి (శక్తి) కార్యక్రమం అంటే (స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలేజ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్) తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాల శాఖ పేరును గా మార్చింది.అంటే నైపుణ్య మానవ మూలధనం జ్ఞాన శిక్షణ చొరవలు (శక్తి) ద్వారా జరిగిన ప్రధాన మార్పులు నైపుణ్య శిక్షణ మొత్తాన్ని ఒకే చోటి నుండి నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిశ్రమల శాఖ నుండి తీసి, కొత్త (శక్తి) శాఖ కిందకు మార్చారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఐటీఐ కళాశాలలు, ఏటీసి లు ఇవన్నీ ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కిందకు వస్తాయి అన్ని పాలిటెక్నిక్ కళాశాలలు – వీటిని కూడా దశలవారీగా ఈ యూనివర్సిటీలో కలుపుతారు ఈ మార్పుకు కారణం నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్య మరియు ఉద్యోగాలను అన్నింటినీ ఒకే వేదిక కిందకు తీసుకురావడం. దీని వల్ల విద్యార్థులకు శిక్షణ నుండి ఉద్యోగం వరకు ఒకే వ్యవస్థలో సహాయం అందుతుంది. (శక్తి) కార్యక్రమం ద్వారా ఐటీఐ,పాలిటెక్నిక్ లను అన్నింటినీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేశారు. ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి అంతరాయం ఉండదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం 2026-29 పాలిటెక్నిక్ ప్రవేశాలు పొందిన విద్యార్థులు తాము బీటెక్ చేసేందుకు తమకు వచ్చిన మెరిట్ సిట్ ద్వారా పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యారు. ప్రభుత్వం జూన్ 2026 లోనే జీవోలు విడుదల చేసినప్పటికీ పాలిటెక్నిక్, ఐటిఐ, ఏటీసీ లలో ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసింది. (శక్తి) కార్యక్రమం ద్వారా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రక్రియ మొదలుపెట్టిన ప్రభుత్వం ప్రవేశాలు ఎందుకు చేపట్టినట్లు అనే సందేహం విద్యార్థుల్లో వారి తల్లిదండ్రులు వ్యక్తం అవుతుంది దీని పట్ల ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ఎస్బిటిఈటి సమగ్రమైన సందేహాల నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీని పట్ల ప్రభుత్వం తక్షణమే పునరాలోచించి అడ్మిషన్లు ఏ ప్రక్రియ ద్వారా తీసుకున్నారు అదే ప్రక్రియ ద్వారా వారికి పాలిటెక్నిక్ ఐటిఐ ఏ టి సి ద్వారా విద్యా సంవత్సరం పూర్తయ్యాక వారించుకున్న చదువును వారికి అందించి వారు అనుకునే (స్కిల్) యూనివర్సిటీ ప్రోగ్రాం ద్వారా నేరుగా ప్రవేశాలు తీసుకోవాలని ఇటువంటి అనాలోచిత ధోరణితో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయ వద్దని సాంకేతిక విద్యాశాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేనట్లయితే ప్రభుత్వం సమస్యలను సారంగా ఆలోచనలు మార్చుకుంటే విద్యార్థుల్లో అలజడివేకి ఉద్యమాల బాట పట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి తామేంచుకున్న విద్యలో విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని ప్రవేశాలు పొందిన విద్యార్థులు కోరుతున్నారు. శక్తి ప్రోగ్రాం ద్వారా పాలిటెక్నిక్ విద్యను సమూలంగా నిర్మూలిస్తూ స్కిల్ యూనివర్సిటీ పేరుతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ భవిష్యత్తు లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం పట్ల వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కారు. పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని పాలిటెక్నిక్ అనంతరం ఇంజనీరింగ్ చేసుకునే అవకాశాన్ని గతంలో మాదిరిగానే విద్యార్థులకు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ నిర్ణయం మార్చుకోవాల్సిందిగా ధర్నా నిర్వహిస్తున్న వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు. పాలిటెక్నిక్ నుంచి ములుగు రోడ్డు వద్దకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాలిటెక్నిక్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.