నాగర్ కర్నూల్ జిల్లా లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు,
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి,
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్,
నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి
ఆగస్టు 15న నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ముఖ్య అతిథిగా నియమించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి హాజరై ఉదయం 9:20 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ శుక్రవారం తెలిపారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కార్యక్రమ వివరాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ వెల్లడిస్తూ, ఉదయం 9:05 గంటలకు జిల్లా ఎస్పీ, 9:10 గంటలకు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్, అనంతరం 9:15 గంటలకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి డా. జి. చిన్నారెడ్డి పెరేడ్ మైదానానికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.9:20 గంటలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన, రాష్ట్ర అధికారిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 9:30 గంటలకు పోలీస్ కవాతు, 9:40 గంటలకు ముఖ్య అతిథి జిల్లా ప్రగతి సందేశం ఇవ్వనున్నారు. అనంతరం 10:05 గంటలకు వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 10:40 గంటలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేయనున్నారు. 10:45 గంటలకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి స్టాళ్లను ముఖ్య అతిథి సందర్శించనున్నారు. 11:15 గంటలకు వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల బహూకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 11:45 గంటలకు జాతీయ గేయాలాపన, జాతీయ గీతాలాపన అనంతరం 11:50 గంటలకు వందన సమర్పణతో కార్యక్రమం ముగియనుంది.80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, ప్రజల్లో దేశభక్తి భావాలను మరింతగా పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు.