బిజెపి పట్ల ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుంది…

బిజెపి పట్ల ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుంది…

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల రోజురోజుకు పూర్తి విశ్వాసం పెరుగుతోందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కోన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫతే నగర్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ పార్క్ నుండి ఇంటింటికీ బీజేపీ భరోసా యాత్ర 61వ రోజు కొనసాగింది. ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మరోసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు.రోజురోజుకు బీజేపీ పార్టీకి ప్రజల్లో పూర్తిగా విశ్వాసం పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈసారి తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కృష్ణాగౌడ్, డివిజన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, నియోజకవర్గ ఓ బి సి కో కన్వీనర్ సతీష్ గౌడ్ , జిల్లా యువ మోర్చ నాయకులు హరిప్రసాద్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బానేశ్,శ్రీనివాస్ రెడ్డి, రేవప్ప, డివిజన్ ప్రధాన కార్యదర్శిలు యాదగిరి, బ్రమ్మం, గోపాల్, నాగేష్, తులసి, కార్తిక్, సాయి, అర్జున్, చింటూ, మనోజ్ , చైతన్య, ఉషారాణి, కృష్ణ వేణి, గణేష్, డివిజన్ ల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking