బీజేపీ లేబర్ సెల్ రామన్నపేట మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్

బీజేపీ లేబర్ సెల్ రామన్నపేట మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్

– కో-కన్వీనర్‌గా కాండూరి నరేష్ నియామకం

రామన్నపేట, అక్షిత ప్రతినిధి : 

బీజేపీ లేబర్ సెల్ (కార్మిక విభాగం) రామన్నపేట మండల కన్వీనర్‌గా పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కూనూరు సుధాకర్ గౌడ్, కో-కన్వీనర్‌గా దుబ్బాక గ్రామానికి చెందిన కాండూరి నరేష్ నియమితులయ్యారు. ఆదివారం రాష్ట్ర కన్వీనర్ అంది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నల్లగొండలో జిల్లా కన్వీనర్ ఐతరాజు సిద్దు, కో-కన్వీనర్ అనుమోజు రామాచారి వీరికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర కన్వీనర్ అంది శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ ఐతరాజు సిద్దు, కో-కన్వీనర్ అనుమోజు రామాచారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking