ఐక్యతతోనే హక్కుల సాధన
– ఉద్యోగుల సమస్యల సాధనకు కృషి
– రాష్ట్ర అధ్యక్షులు వెంకట రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాతంగి వీరబాబు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాతంగి వీరబాబులు అన్నారు.ఆదివారం తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల సాధనకు సంఘం అవిరళ కృషి చేస్తుందన్నారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర పదాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని న్యాయశాఖ ఉద్యోగులు Satisfaction వివిధ సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ సంబంధిత అంశాలు, ఉద్యోగుల సంక్షేమం, పదోన్నతులు, బదిలీలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశారు. న్యాయశాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, ఐక్యతను బలోపేతం చేయడం, ఉద్యోగుల సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని సంఘం నాయకులు తెలిపారు. కావున, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఇతర పదాధికారులందరూ సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాతంగి వీరబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు మధు, వంశీలత, గోపీనాథ్ సహాయ కార్యదర్శులు, భుజంగరావు మల్లికార్జున్ కొమరయ్య ట్రెజరర్ నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.