మందమర్రిలో 14న ఫ్యామిలీ డే – ఆట పాట వేడుకలు
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్‌లో ఈ నెల 14న బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఫ్యామిలీ డే – ఆట పాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏరియా డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా మహిళలకు వివిధ ఆటల పోటీలు, గరిష్ఠంగా ఎనిమిది మంది సభ్యులతో గ్రూప్ డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేలా అందంగా పేర్చిన బతుకమ్మల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నారు. కార్మికులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరై, పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీహెచ్. అశోక్ కోరారు.