కూచిపూడి దేవాలయాల సింహద్వారానికి శంకుస్థాపన

కూచిపూడి దేవాలయాల సింహద్వారానికి శంకుస్థాపన

– శెట్టి వారి దైవభూమిలో ఐదు ఆలయాల నిర్మాణం

– భక్తులు విరివిగా విరాళాలు అందించాలి 

– ఆలయ నిర్వాహకులు కందికొండ సాయిబాబు

కోదాడ అక్షిత ప్రతినిధి

గ్రామంలోని అంతరగంగా వాగు సమీపంలో శెట్టి వారి వంశస్థులు దేవాలయాల నిర్మాణం కోసం విరాళంగా అందించిన స్థలంలో నిర్మిస్తున్న ఆలయాల ప్రాంగణంలో నూతన సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో ఆలయాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కందికొండ సాయిబాబు మాట్లాడుతూ లక్షల రూపాయల విలువైన భూమిని దేవాలయాల నిర్మాణానికి విరాళంగా అందించి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి పునాదులు వేసిన శెట్టి వారి వంశస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు, దాతలు, భక్తుల సహకారంతో శెట్టి వారి దైవభూమిలో భక్తాంజనేయ స్వామి, సీతా రామాంజనేయ స్వామి, శబరిగిరి అయ్యప్ప, లక్ష్మీ నరసింహ స్వామి, షిర్డీ సాయి మందిరాల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking