హనుమకొండ హాఫ్ మారథాన్–ఎడిషన్ 2 టీషర్ట్స్ ఆవిష్కరణ.
– యువ నాయకులు విష్ణురెడ్డి
కాజిపేట్, అక్షిత ప్రతినిధి :
హనుమకొండలో ఈ నెల 17 వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ట్రయ్ సిటీస్ హాఫ్ మారథన్ 2026– ఎడిషన్ 2 కు సంబంధించిన టీషర్ట్స్‌ను వరంగల్ క్లబ్‌లో మారథాన్ నిర్వాహకులు, యువ నాయకులు విష్ణురెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణురెడ్డి మాట్లాడుతూ.. మారథాన్‌ల నిర్వహణ ద్వారా యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ఫిట్‌నెస్, క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి వరంగల్ అధ్యక్షుడు నాయిని అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాకమూరి అమరేశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, వరంగల్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్, ఏసీపీ సత్యనారాయణ, సీఐలు రంజిత్, వెంకన్న ,క్రెడాయి సభ్యులు,మారథాన్ రన్నర్స్ తదితరులు పాల్గొన్నారు.