ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలి

ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలి

 -ఎస్సై వంశీకృష్ణ

గంగాధర అక్షిత న్యూస్

దసరా సెలవుల సందర్భంగా చాలామంది కుటుంబాలతో కలిసి స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉన్నందున ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పై వంశీకృష్ణ సూచించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇంటి ప్రధాన ద్వారాలు, కిటికీలు, వెనుక ద్వారాలకు పటిష్టమైన తాళాలు వేయాలని, ఇంట్లో బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉంచుకోకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో బహిరంగంగా తెలియజేయకూడదని, ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.సాధ్యమైనంత వరకు ఇంటి వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పటికే ఉన్న సిసి కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని తెలియజేశారు.ఇంటి బయట తాళాలు స్పష్టంగా ఉంచకుండా ఇంట్లో ఎవరూ లేరనే విషయం ఇతరులకు సులభంగా తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు తమ ఇళ్ళకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్ళేముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించడం ద్వారా అనుమానాస్పద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండేందుకు ఏదైనా అనుమానాస్పద ఘటన లేదా దొంగతనం జరిగినట్లు గుర్తించిన వెంటనే డయల్ 100 లేదా 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking