ఇరుకు రోడ్డుతో వాహనదారుల ఇక్కట్లు!
– రామన్నపేట–అమ్మనబోలు రహదారిపై తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రం నుంచి అమ్మనబోలు వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు పక్కకు తప్పుకోవడానికి కూడా సరైన స్థలం లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు ఎదురైనప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ కాలువలు కూడా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవడంతో పాటు డ్రైనేజీ కాలువలకు మూతలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.