దారి ఉంది.. దిశ చూపే బోర్డులేవీ!
– అమ్మనబోలు, నీర్నెముల,వేములకొండ వెళ్లే మార్గాల్లో ప్రయాణికుల ఇబ్బందులు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
మండల కేంద్రం నుంచి అమ్మనబోలు , నీర్నెముల, వేములకొండ గ్రామాలకు వెళ్లేందుకు రహదారులు ఉన్నప్పటికీ, ఆయా మార్గాల్లో దారి సూచించే బోర్డులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొత్తగా ఈ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికులు ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రహదారుల కూడళ్ల వద్ద గ్రామాల పేర్లు, దూరాన్ని తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు స్థానికులను అడిగి దారి తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పనులపై వెళ్లేవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రామన్నపేట నుంచి అమ్మనబోలు , నీర్నెముల, వేములకొండ వెళ్లే మార్గాల్లో గ్రామాల పేర్లు, దూరాన్ని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.