తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
– మహిళల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వర్ణక్క, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొని బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మహిళలంతా కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాదె శోభారాణి, వైస్ ప్రెసిడెంట్ అయ్యడపు కవిత, రామన్నపేట పట్టణ కన్వీనర్ భైరబోయిన శోభ పాల్గొన్నారు

