నాంపల్లిలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

నాంపల్లిలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

– క్రీడలు ఐకమత్యానికి ప్రతీకలు

– క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

 – మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 

 – నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలను పరిశీలించిన కుసుకుంట్ల

  – ప్రజా ఆరోగ్యం పై కుసుకుంట్ల ప్రత్యేక దృష్టి 

 నాంపల్లి, అక్షిత న్యూస్:

మండల కేంద్రంలో బుధవారం నాంపల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నాంపల్లి క్రికెట్ ప్రీమియం లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై ఈ క్రీడలను ప్రారంభించడం జరిగింది . అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి క్రికెట్ ప్రీమియం లీగ్ మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి నాంపల్లి మండలంలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన క్రికెట్ నాంపల్లి క్లబ్ ను అభినందించాడు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని కులమతాలకు పార్టీలకు ఎలాంటి తావు లేకుండా కలిసికట్టుగా ఆడాలని గెలుపోటములు సహజమని ఓడిపోయిన వాళ్లు నిరుత్సాపడకుండా గెలుపు దిశగా ముందుకెళ్లాలని ఆయన క్రీడాకారులకు మరింత ఉత్తేజాన్ని నింపారు. అనంతరం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ సమస్యలను ఈరోజు విధులు నిర్వహిస్తున్న ఈ వైద్య కేంద్రంలో పూర్తిస్థాయిలో ఉన్న 22 మంది సిబ్బందికి గాను ఒక నర్సు ఒక అటెండర్ విధులు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న నర్సును హాస్పిటల్ సమస్యలను అడిగి తెలుసుకుని విధులకు రాని వైద్యాధికారుల యొక్క హాజరు పట్టికను పరిశీలించి ఎలాంటి లీవ్ లెటర్ పెట్టకుండా విధులకు రాకుండా పక్క గ్రామానికి విద్య సేవలకు వెళ్ళినామని అక్కడ వైద్య సేవలు నిర్వహిస్తున్న ఉన్నామని చెప్పుకుంటూ విధులకు హాజరు కాకుండా నెల రాగానే జీతం కోసం హాజరు. రిజిస్టర్ లో సంతకాలు చేస్తూ హాస్పిటల్ కు వచ్చిన రోగులను పట్టించుకోకుండా వారికి అందాల్సిన మందులను పేషెంట్లు ఉండే వార్డులో వారు వాడే మరుగుదొడ్లను స్టోరేజ్ రూముగా ఏర్పాటు చేసుకొని పేషెంట్లకు అందాల్సిన మందులు మరుగు దొడ్లలో పడేసి ఉన్నాయి. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను పట్టించుకోకుండా ఇక్కడ డాక్టర్లు లేరు మర్రిగూడెం ఆస్పత్రికి వెళ్ళమని విధులు నిర్వహిస్తున్న వారితో చెప్పిస్తూ చెప్పిస్తున్నారు. అనారోగ్య పరిస్థితులలో హాస్పిటల్ కి వచ్చిన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక ఆర్.ఎం.పి డాక్టర్లు ఆశ్రయించి నానా ఇబ్బందులు పడుతూ పెద్ద దావకనులకు వెళ్లి అప్పల బారిని పడుతున్నారని మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.  ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది నక్క రవీందర్, బిఆర్ఎస్ నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు, సర్పంచులు నక్క చంద్రశేఖర్, జిల్లా శోభ సహదేవ్, కడారి శ్రీశైలం, సాగర్ల యాదయ్య, పల్లె వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సభావత్ సర్దార్, గౌరీ కిరణ్, నాంపల్లి మండల క్రికెట్ క్లబ్ అధ్యక్షులు పోగుల మల్లారెడ్డి, ఎన్ పి ఎల్ ప్రాన్చైజెస్ ఓనర్స్ వడ్లకొండ రమేష్, నేతల ఆంజనేయులు, పగిళ్ల వెంకటయ్య, అమరావది యాదయ్య, మునగాల శ్రీధర్ రెడ్డి, తాజ్ చికెన్ సెంటర్ చైర్మన్ చోటే, ప్రవీణ్ క్రీడాకారులు, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking