భూముల రీ-సర్వేపై అపోహలు వద్దు

భూముల రీ-సర్వేపై అపోహలు వద్దు

 – భూ సమస్యల శాశ్వత పరిష్కారానికె భూముల రీ సర్వె

– జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

పర్వతగిరి అక్షిత ప్రతినిధి

మండలంలోని గోపనపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన భూముల రీ-సర్వే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని, రీ-సర్వేపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూముల రీ-సర్వే ప్రక్రియ ద్వారా భూముల సరిహద్దులు, విస్తీర్ణం, భూ రికార్డుల కోసం వివరాల్లో స్పష్టత, పారదర్శకత పెరుగుతాయని తెలిపారు. భూముల రీ-సర్వేపై ఎలాంటి అపోహలకు గురికాకుండా రైతులు, భూ యజమానులు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని అధికారులకు సహకరించాలని సూచించారు. భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, రికార్డుల్లో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసరావు, వరంగల్ ఆర్డీవో సుమ, పర్వతగిరి తహసిల్దార్ వెంకటస్వామి, గోపనపల్లి సర్పంచ్ నాంపల్లి విజయ, అనంతారం సర్పంచ్ తౌటి శ్రీలత, సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking