ఆపదలో భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

ఆపదలో భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

– 111 మందిలబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

గంగాధర అక్షిత న్యూస్ 

అనారోగ్యంతో, ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన 111 మంది లబ్ధిదారులకు రూ.31,08,700 ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సాయం మంజూరు అయింది. కాగా బుధవారం గంగాధర ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ పంపిణీ చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల కంటే రెట్టింపు చెక్కులను కేవలం మూడేళ్లలోనే పంపిణీ చేసినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్ సర్పంచులు, వేముల భాస్కర్,రేండ్ల శ్రీనివాస్, చిందం ఆంజనేయులు, బిర్ల ఆనందం, రాచమల్ల రవి,బాసవేణి శ్రీనివాస్,దాసరి శంకరయ్య ఈటవేణి శ్రీనివాస్, పడాల భాగ్యలక్ష్మి రాజన్న, దానే అనసూయ ఓదెలు, కడారి రేణుక కనకయ్య, సంధ్య చంద్రారెడ్డి, కవిత మల్లేశం, బాబా లక్ష్మి మధు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కొండయ్య తిరుమలరావు పురుమల్ల మనోహర్, సాగి అజయ్ రావు, చిరుతమంగ, తోట సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking