రెండవ రోజు రసవత్తరంగా సాగిన నాంపల్లి ప్రీమియం లీగ్

రెండవ రోజు రసవత్తరంగా సాగిన నాంపల్లి ప్రీమియం లీగ్

 – క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి

 – ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న నాంపల్లి ప్రీమియం లీగ్ టోర్నమెంట్ 

    నాంపల్లి, అక్షిత న్యూస్:

మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నాంపల్లి క్రికెట్ ప్రీమియర్ లీగ్ గురువారం రెండవ రోజు ఆట రసవత్తరంగా కొనసాగింది. క్రీడాకారులు ఉత్సాహంగా ఈ క్రీడలో పాల్గొంటూ తన ప్రతిభను సత్తా చాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది జట్లు పాల్గొనగా అందులో నాలుగు జట్లు గెలుపొందగా మరో నాలుగు జట్లు ఓటమి చెవి చూశాయి ఇందులో గెలుపొందిన జట్లు మొదటి జట్టు గ్రీన్ ఆర్మీ, అమరావతి యాదయ్య యువసేన,నేతల ఆంజనేయులు యువసేన, పగిళ్ల వెంకటయ్య యువసేన టీంలు గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో,నాంపల్లి మండల క్రికెట్ క్లబ్ అధ్యక్షులు పోగుల మల్లారెడ్డి, ఎన్ పి ఎల్ ప్రాన్చైజెస్ ఓనర్స్ వడ్లకొండ రమేష్, నేతల ఆంజనేయులు, పగిళ్ల వెంకటయ్య, అమరావది యాదయ్య, మునగాల శ్రీధర్ రెడ్డి, తాజ్ చికెన్ చైర్మన్ చోటే, ప్రవీణ్ క్రీడాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking