స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా
– ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ /అక్షిత న్యూస్:
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, వలిగొండ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం ద్వారా ఆహార భద్రతకు భరోసా కల్పించడంతో పాటు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు మరింత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుల ద్వారా అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.అదేవిధంగా, సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్ అందించడం ద్వారా వారి సొంతింటి కల సాకారమయ్యేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా పనోచేయడమే మా ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి ఎమ్మార్వో దశరథ, పిఎసిఎస్ చైర్మన్ గరిసే రవి, మండల పార్టీ అధ్యక్షులు బత్తిని సహదేవ్, బుగ్గ వెంకటేష్, వడ్డేమాన్ దేవేందర్, జక్క దామోదర్ రెడ్డి, పాశం స్వామి, వేముల మల్లేష్, సిలువేరు మహేష్, బుగ్గ కృష్ణ, బుగ్గ మనోజ్ కుమార్,ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

