బయో గ్యాస్ కంపెనీకి భూమి పూజ
వలిగొండ అక్షిత న్యూస్
వలిగొండ మండల పరిధిలోని నర్సాపురంలో అతిరద్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో నెలకొల్పబడిన మత్స్యగిరి బయోగ్యాస్ కంపెనీకి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ బయోగ్యాస్ కంపెనీని గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పబడడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని,దీని ద్వారా ఎంతో మంది రైతులకు లబ్ది చేకూరడంతో పాటు గ్రామీణ యువతకు పట్టణాలకు వెళ్లకుండా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు.ఈ బయోగ్యాస్ కంపెనీలు తెలంగాణలో 25 ఆంధ్రాలో 25 నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టామని మొట్టమొదటి బయోగ్యాస్ కంపెనీ మత్యాద్రి పుణ్యక్షేత్ర పరిధిలో ప్రారంభించడం శుభ సూచకమని అన్నారు.ఈ కార్యక్రమంలో భూమి యజమాని పిసరి వెంకటరెడ్డి, నర్సాపురం సర్పంచ్ కావటి మంజుల ఉప్పలయ్య,సామ సరస్వతి రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.