ఘనంగా ఎంపీడీవో కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు
గుడిపల్లి, అక్షిత ప్రతినిధి:
గుడిపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో శనివారం బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, పూల అలంకరణలతో కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను ఐకమత్యంతో జరుపుకోవాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి ఎంపీడీవో డి ఎం అబ్దుల్ అజీమ్, ఎంపీఓ నవీన్ , గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.