అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి
– కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు బుద్ధుడు
చిట్యాల అక్షిత ప్రతినిధి
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారందరూ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుపై నిర్లక్ష్యం చేయకుండా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, ఉరుమడ్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకు సైదులు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్, మేడబోయిన స్వాతి శ్రీను, ఉయ్యాల మల్లేష్, గంగాపురం వెంకటేష్, ఎం.డి. జాంగిర్, ఎం.డి. కాజా, బెలిజ అరుణ్ కుమార్, కొండ శ్రీను, రూపాని రవి, బెలిజ మహేష్, గుంటోజు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

