రామన్నపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
– రిజిస్టర్డ్ కమిటీని పునరుద్ధరణ
– నూతన కమిటీ అధ్యక్షులు గా తెలుసూరి మల్లేశ్, ప్రధాన కార్యదర్శి గా బత్తుల గణేష్
రామన్నపేట, అక్షిత ప్రతినిధి
రామన్నపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులు గా తెలుసూరి మల్లేశ్, ప్రధాన కార్యదర్శి గా బత్తుల గణేష్ లు ఎన్నికై, రామన్నపేట రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్ ను పునరుద్ధరణ చేసి నూతన కమిటీ ఎన్నుకున్నారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కొండ మల్లేశం గౌడ్, గౌరవ సలహాదారులు గా రుద్రాల శ్రీరాములు, కెవి సుధాకర్ రాజు, అధ్యక్షులు గా తెలుసూరి మల్లేశ్, ప్రధాన కార్యదర్శి గా బత్తుల గణేష్, కోశాధికారి గా నడిగోటి నగేష్, ఉపాధ్యక్షులు గా సిర మహేష్, నోముల శంకర్, సహాయ కార్యదర్శి గా ముత్యాల రమేష్, కార్యవర్గ సభ్యులుగా నాగటి యాదయ్య, వీరమల్ల రమేష్ లను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సమస్యలు, కమిటీ బలోపేతంకి కృషి చేస్తామని తెలుపుతూ, నూతన రిజిస్టర్డ్ కమిటీ ఎన్నిక విషయం అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల ప్రజలందరికీ తెలుపుతూ అందరీ సహకారం అందజేయాలి తెలిపారు