ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు

– తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా, పశుసంపద పరిరక్షణపై ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి సమీక్ష

రాయపర్తి అక్షిత ప్రతినిధి

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరువు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పశుసంపదను పరిరక్షించడంతో పాటు ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంపై అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలన్నారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకునేలా రైతులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. గ్రామపంచాయతీల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇంజనీరింగ్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే ఉపాధి హామీ పథకం (వీబీజీ రాంజీ) ద్వారా ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, ఫామ్ పాండ్స్ వంటి నీటి సంరక్షణ పనులను చేపట్టేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్ ఎం శ్రీనివాస్ , ఎంపీడీవో పాక శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది, వ్యవసాయ అధికారి, పశువైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఇరిగేషన్ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, విద్యుత్ శాఖ ఏఈ, ఏపీవో తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking